ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తప్పేంటి?: జగ్గారెడ్డి
- ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు వద్దు
- కాళేశ్వరం వల్ల నా నియోజకవర్గానికి నీరు వస్తుంది
- సోనియా తెలంగాణను ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ... ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగదని హితవు పలికారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే... తన నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీరిపోతాయని చెప్పారు. సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని... కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఆయనకు దక్కిందని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే ఆ విషయాన్ని భట్టి విక్రమార్క చూసుకుంటారని చెప్పారు.