సీపీఎం నేత కుమారుడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ సీపీఎం నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళకు చెందిన సీపీఎం నేత కొడియేరి కుమారుడు వినయ్ వినోదిని బాలకృష్ణన్(37)పై ముంబైలో అత్యాచారం, మోసం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, ఓ యువతి దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేసేది. ఆ బార్‌కు తరచూ వెళ్లే బాలకృష్ణన్‌తో పరిచయం, ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని యువతితో ఉద్యోగాన్ని మానేయాలని సూచించాడు.

2010లో బాధితురాలు ముంబై సబర్బన్ అంధేరీలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అందులో ఉండేది. ఆ సమయంలో బాలకృష్ణన్ తరచూ ఆమె ఫ్లాట్‌కు వెళ్లి ఉండేవాడు. ఈ క్రమంలో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అతనికి అప్పటికే వివాహమైందనే విషయం బాధితురాలికి గతేడాది తెలిసింది. దీంతో వీరి మధ్య గొడవలు జరిగాయి. విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Mumbai
Balakrishnan
CPM Leader
Bar Dancer
Dubai
Flat

More Telugu News