paruchuri: 'కర్తవ్యం' సినిమా విషయంలో అలా జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో విజయశాంతిని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "1981లో చెన్నై లోని విజయ వాహిని స్టూడియోలో నేను విజయశాంతిని తొలిసారి చూశాను. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయమని అక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమె వయసు 14- 15 సంవత్సరాలు ఉంటాయి.

ఆ రోజున చాలా చిన్నపిల్లగా కనిపించిన విజయశాంతి, ఆ తరువాత సంచలనాలు సృష్టించింది. మేము శారద గారితో 'ప్రతిధ్వని' చేసిన తరువాత, అలాంటి కథ ఒకటి విజయశాంతికి రాయమని నిర్మాత ఎ.ఎం.రత్నంగారు అడగడం మొదలుపెట్టారు. ఆ తరువాత నేను 'కర్తవ్యం' సినిమా కథ రాశాను. కథ పూర్తయిన తరువాత 'మీనా' పాత్రను జోడించడం జరిగింది. ఆ తరువాత విజయశాంతి పాత్రను హైలైట్ చేయడం కోసం క్లైమాక్స్ ను మార్చడం జరిగింది. ఈ సినిమా ఎంతటి సంచలనానికి తెరతీసిందో తెలిసిందే" అన్నారాయన.   
Go Back to Shorts
paruchuri
vijayashanthi

More Telugu News