బుద్ధా వెంకన్నకు సెక్యూరిటీ తగ్గింపు... అసలు వద్దేవద్దన్న టీడీపీ నేత!
- 2+2 నుంచి 1+1కు తగ్గింపు
- నాకు ఆ ఇద్దరూ కూడా వద్దు
- వెనక్కు పంపిన బుద్ధా వెంకన్న
వాస్తవానికి విజయవాడలో నివాసం ఉండే ప్రజా ప్రతినిధులు, మంత్రులకు సిటి సెక్యూరిటి వింగ్ నుంచి గన్ మెన్ లను కేటాయిస్తారు. జిల్లాలోని మిగతా ప్రజా ప్రతినిధులకు ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగం నుంచి గన్ మెన్ లను పంపుతారు. కాగా, గన్ మెన్ ల ఉపసంహరణ తమ చేతుల్లో లేదని, స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పడిన కమిటీ సూచనల మేరకే భద్రత ఖరారవుతుందని చెబుతున్నారు.