Andhra Pradesh: టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుపై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు పెట్టాలి!: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కోడెల ‘కె’ ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలు అవుతోందని వ్యాఖ్యానించారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోడెల కుమారుడు, కుమార్తె చిరు వ్యాపారులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన కోడెల శివప్రసాదరావుపై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘కోడెల K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు, కూతురు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్ పై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని  ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
kodela
Twitter
Vijay Sai Reddy

More Telugu News