కేసీఆర్ లాంటి పొలిటికల్ టెర్రరిస్ట్ పై నా పోరాటం కొనసాగుతోంది: భట్టి విక్రమార్క
- టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీన ప్రయత్నం దారుణం
- ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారు
- కేసీఆర్ ఎక్కడో దాక్కుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ను పూర్తిగా విస్మరిస్తున్నారని, దీనిపై కేసీఆర్ ఎక్కడ చర్చ పెట్టినా వచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లాగా తాము డ్రామాలు ఆడమని, ఫిరాయింపులు ఆపకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్’లో నాయకత్వం లోపించిందని పార్టీ ఫిరాయింపుదారులు మాట్లాడటం తగదని, వాళ్లు చెప్పింది నిజమే అయితే, ‘బీ ఫామ్’ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.