చీరలపై హాట్ చర్చ... ఘాటు సమాధానం ఇచ్చిన యాంకర్ రష్మీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీరలపై హాట్ చర్చ... ఘాటు సమాధానం ఇచ్చిన యాంకర్ రష్మీ!

  • రవిక లేకుండా ప్రియాంక ఫోటో షూట్
  • ఓ వెబ్ సైట్ కథనాన్ని రీట్వీట్ చేసిన రష్మి
  • పొట్టి దుస్తులు వద్దని ఓ నెటిజన్ కామెంట్
  • నువ్వు పుట్టడమే నేరమంటూ రష్మి మండిపాటు
ఇటీవల ఓ మేగజైన్ కోసం ఫొటో షూట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, రవిక ధరించకుండా పోజులివ్వగా, కొందరు మండిపడ్డారు, మరికొందరు ఇండియాలో రవిక లేకుండా చీర ధరించే మహిళలు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ప్రియాంక కవర్ పేజ్ వైరల్ కావడంతో, దీనిపై ఎంతో చర్చ జరుగుతోంది. పూర్వకాలం నుంచి రవిక లేని చీరలు కట్టుకునే సంప్రదాయం ఇండియాలో ఉందంటూ, ఓ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని కూడా రాసింది. అంతవరకూ బాగానే ఉంది. ఈ కథనాన్ని యాంకర్ రష్మి రీ ట్వీట్ చేస్తూ, తన అభిమానులతో పంచుకుంది.

దీనిపై స్పందించిన ఓ నెటిజన్, "ఇలాంటివి ధరించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరిస్తూ అత్యాచారాలకు గురవుతున్నారు. సరైన పొడవు దుస్తులు ధరిస్తే నేరాల్ని తగ్గించొచ్చు. దీని గురించి కాస్త ఆలోచించండి" అనగా, దీన్ని చూసి ఆగ్రహించిన రష్మీ, ఘాటైన రిప్లై ఇచ్చింది. "ఇటువంటి ఆలోచనలు ఉన్న నువ్వు పుట్టడమే పెద్ద నేరం" అని మండిపడింది. దీంతో కంగుతిన్న ఆ నెటిజన్, తన ట్వీట్‌ ను డిలీట్‌ చేయడంతో పాటు తాను రష్మికి వ్యతిరేకం కాదని, కొన్ని సందర్భాల్లో నేరాలు ఇలా కూడా జరుగుతుంటాయని చెప్పుకొచ్చాడు. బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరాడు.
Rashmi
Priyanka Chopra
Photoshoot
Net

More Telugu News