INS Shivaji: నేవీలో పనిచేస్తున్న తెలంగాణ యువకుడి ఆత్మహత్య!

  • ఇంజనీరింగ్ మెకానిక్స్ చదువుతున్న కన్నాల అకాశ్
  • ఆత్మహత్యపై నేవీ అంతర్గత విచారణ
  • పోలీసు కేసు కూడా నమోదు
ఐఎన్ఎస్ (ఇండియన్ నావెల్ స్టేషన్) శివాజీలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు తెలంగాణలోని నిర్మల్ జిల్లా వాసి కన్నాల ఆకాశ్ అని, అధికారులు గుర్తించారు. లోనావాలాలోని కేంద్రంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ కోర్సును అభ్యసిస్తున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఆకాశ్ ఎందుకు ఈ పని చేశాడన్న విషయాన్ని తేల్చేందుకు విచారణ కమిటీని నియమించామని తెలిపారు. ఆకాశ్ మృతిపై లోనావాలా పోలీసులు కేసును రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించారు. నేవీ సైతం అంతర్గత విచారణ చేస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
INS Shivaji
Hang
Telangana

More Telugu News