Nellore District: తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నాడని... యువకుడిపై స్నేహితులతో కలిసి అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
తన భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడన్న అనుమానంతో, ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఓ యువకుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేటలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఉచ్చూరుకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ షోరూమ్ వద్ద నిలబడివుండగా, నాగరాజపురానికి చెందిన దయాకర్‌, బాలచెన్నయ్య, వెంకట్వేర్లు, ఎం మహేష్‌, మస్తాన్‌ అనే యువకులు అక్కడికి వచ్చి, మాటల్లో పెట్టి, ఆటోలో కిడ్నాప్‌ చేశారు.

ఆపై శివార్లకు తీసుకెళ్లి, కర్రలతో కొట్టారు. అతనిపై అత్యాచారం చేస్తూ, సెల్ ఫోన్ లో వీడియో తీశారు. విషయం బయటపెడితే వీడియోలను బహిర్గతం చేస్తామని బెదిరించి పారిపోయారు. కాసేపటికి తేరుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల్లో ఒకరి భార్యకు, బాధితుడికి వివాహేతర బంధం ఉందని, అందుకు ప్రతీకారంగానే ఈ ఘటనకు పాల్పడ్డారన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Nellore District
sULLURUPETA
rAPE
Police

More Telugu News