BJP: ఎన్నికల్లో 'లాటరీ' కొట్టిన బీజేపీ అభ్యర్థి!

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రాలు జరుగుతుండటం సాధారణమే. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోనూ అలాంటిదే జరిగింది. పిప్రి గ్రామంలోని ఓట్ల లెక్కింపులో ఓ తమాషా చోటుచేసుకుంది. ఇక్కడ మొదట జరిపిన ఓట్ల లెక్కింపులో రెండు ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.

దీనిపై బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించక తప్పలేదు. అయితే రీకౌంటింగ్‌లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ చెరో 690 ఓట్లు రావడం గమనార్హం. దీంతో ఎన్నికల అధికారులు విజేతను నిర్ణయించేందుకు లాటరీ పద్ధతిని ఆశ్రయించడంతో అనూహ్యంగా విజయం బీజేపీ అభ్యర్థిని వరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ ఎంపీటీసీగా గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.
Go Back to Shorts
BJP
TRS
Erravva
Recoounting
NIzamabad
Pipri

More Telugu News