Chittoor District: అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టిన కంటైనర్‌ లారీ..తృటిలో తప్పిన ప్రమాదం

షార్ట్స్‌లో చూడండి
అదుపు తప్పిన ఓ కంటైనర్‌ వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి దూసుకుపోయినా అదృష్టవశాత్తు కిందకి పడిపోక పోవడంతో డ్రైవర్‌, అతని సహాయకుడి ప్రాణాలు దక్కాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గురైన లారీ రైలింగ్‌ను ఢీకొట్టి కాలువ వైపు దూసుకుపోయి నిలిచిపోయింది. వేలాడుతున్న కంటైనర్‌ను చూసి స్థానికులు ఆందోళన చెందారు. డ్రైవర్‌, సహాయకుడు చాకచక్యంగా వాహనం నుంచి బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది. కాకుంటే ఈ ఘటన వల్ల కుప్పం-పలమనేరు రహదారిలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వంతెనపై నుంచి లారీని తీసి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు.
Go Back to Shorts
Chittoor District
palamaneru
Road Accident

More Telugu News