మిస్టర్ దామోదర్ గౌతమ్ సవాంగ్... మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా: జగన్

  • ఏపీ కొత్త డీజీపీకి జగన్ శుభాకాంక్షలు
  • ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన జగన్
  • పోలీస్ బాస్ గా బాధ్యతలు అందుకున్న సవాంగ్
రాష్ట్ర నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా విధులు చేపట్టిన దామోదర్ గౌతమ్ సవాంగ్ కు శుభాకాంక్షలు. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ జగన్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అంతేకాకుండా, పుష్పగుచ్ఛం అందిస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటోను కూడా పోస్టు చేశారు. ఆర్పీ ఠాకూర్ స్థానంలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా నియమితుడైన సంగతి తెలిసిందే. వైసీపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటినుంచే గౌతమ్ సవాంగ్ నూతన పోలీస్ బాస్ అంటూ వార్తలు వచ్చాయి.                
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
DGP

More Telugu News