ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కూడా మాదే గెలుపు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కు బుద్ధి చెబుతారు
  • నా భార్య ఎమ్మెల్సీగా గెలుస్తుంది
  • సర్పంచ్ లకు ఇంతవరకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదు
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కూడా సత్తా చాటుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన భార్య ఎమ్మెల్సీగా గెలుస్తుందని ఆయన అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికల్లో మాదిరే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ హీనంగా చూస్తోందని... సర్పంచ్ లకు ఇంతవరకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పోటీ చేస్తున్నారు.
Go Back to Shorts
komarireddy
rajagopal reddy
TRS
kcr
congress

More Telugu News