విజయవాడలో జగన్ మేనియా.. ఏకంగా 70 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు!
- నగరంలోని వారధి వద్ద ఏర్పాటు
- చూపరుల్ని ఆకట్టుకుంటున్న కటౌట్
- రేపు మధ్యాహ్నం జగన్ ప్రమాణస్వీకారం
భారీ ఆకారంలో ఉన్న ఈ కటౌట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.