నేను వెళ్లడం లేదు.. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడంపై చంద్రబాబు స్పష్టీకరణ!
- ఇద్దరు ప్రతినిధులను పంపాలని నిర్ణయం
- రేపు జగన్ ను కలవనున్న నేతలు
- అనంతరం ప్రమాణస్వీకారానికి హాజరు
తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కాగా, ఈ ఇద్దరు నేతలు రేపు ఉదయం తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి అభినందిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.