Telugudesam: ఎన్టీఆర్ ఘాట్ వివాదంపై స్పందించిన చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
నిన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహా నటుడు దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ ను పూలతో అలంకరించకపోవడం వివాదానికి దారితీయగా, పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాట్లు చేసిందని చెప్పిన చంద్రబాబు, ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని, సర్కారే అలంకరణ చేస్తుందని భావించామని అన్నారు. ఘాట్‌ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తాను మీడియాలోనే చూశానని చెప్పారు. మరోసారి ఇది పునరావృతం కాకూడదని అన్నారు. ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా అలంకరణ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో సమాచార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Telugudesam
NTR
Ghat

More Telugu News