KCR: కేసీఆర్ కు ఘనంగా అతిథి మర్యాదలు చేసిన టీటీడీ... స్వామి దర్శనం పూర్తి!

షార్ట్స్‌లో చూడండి
నిన్న తిరుమలకు వచ్చిన కేసీఆర్ కు టీటీడీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికి ఈ ఉదయం స్వామివారి దర్శనం చేయించారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మహాద్వారం గుండా లోపలికి వెళ్లిన కేసీఆర్, శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం పలికిన అర్చకులు, కేసీఆర్ కు స్వామివారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందించారు.

అంతకుముందు తిరుమలలోని శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్దకు కేసీఆర్ చేరుకోగా, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ స్వాగతం పలికారు. ఆపై కాసేపు సేదదీరిన తరువాత, శ్రీవారి పాదాలు, శిలాతోరణం తదితర ప్రాంతాలను కేసీఆర్, ఆయన వెంట వచ్చిన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ తిరుమలకు రావడం ఇది రెండోసారి.
Go Back to Shorts
KCR
Tirumala
Tirupati
TTD

More Telugu News