Jagan: పులివెందులలోని జగన్ ఇంటికి ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సెంథిల్ కుమార్.. భద్రత ఏర్పాట్లపై పరిశీలన

షార్ట్స్‌లో చూడండి
పులివెందులలోని ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇంటిని ఆదివారం ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇంటి వద్ద కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సిబ్బందితో చర్చించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు వాటి పర్యవేక్షణ తదితర విషయాలపై చర్చించిన అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా భద్రతకు సంబంధించిన అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆర్అండ్‌బీ, విద్యుత్ అధికారులు, అగ్నిమాపక సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని హెలిప్యాడ్‌తోపాటు, మరో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. దానిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh
Pulivendula

More Telugu News