YSRCP: ఈ నెల 30న నేనొక్కడినే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 30న తాను ఒక్కడినే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని, కొన్ని రోజుల తర్వాత మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని  వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరో వారం, పది రోజుల్లో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని, అవినీతి రహిత పాలన అందిస్తామని, అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కుంభకోణం జరిగితే విచారణ చేపడతామని చెప్పారు.  
Go Back to Shorts
YSRCP
Jagan
newdelhi

More Telugu News