జగనన్న ప్రభుత్వం వచ్చింది.. రైతులంతా దైర్యంగా ఉండాలి!: విజయసాయిరెడ్డి
- రెయిన్ గన్ల పేరుతో ఉత్తుత్తి ప్రచారాలు చేయం
- సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతాం
- సేద్యం పండుగలా మారే రోజులు వచ్చాయి
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కరువు వల్ల నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి. జగనన్న ప్రభుత్వం వచ్చింది. రెయిన్ గన్ల ఉత్తుత్తి ప్రచారాలు కాకుండా కరువు నివారణకు శాశ్వత పరిష్కారాలు ఉంటాయి. సేద్యం పండుగలా మారే రోజులొచ్చాయి. ఇకపై మంచి నీటి సమస్య అనేది లేకుండా ఆయన ముందస్తు ప్రణాళికలు అమలు చేయిస్తారు’ అని తెలిపారు.