Jagan: మూడో పిన్న వయస్కుడు... 46 ఏళ్లకే సీఎంగా జగన్!

షార్ట్స్‌లో చూడండి
మరో వారంలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్, అతి పిన్న వయసులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయనున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం జగన్ వయసు 46 సంవత్సరాల 6 నెలలు కాగా, ఆంధ్రప్రదేశ్‌ విడిపోకముందు 38 సంవత్సరాల 11 నెలల వయసులో దామోదరం సంజీవయ్య సీఎంగా పనిచేశారు. ఆ తరువాత 45 సంవత్సరాలా 5 నెలల వయసులో చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. వీరిద్దరి తరువాత తక్కువ వయసులో సీఎం కానున్నది జగనే. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, అసోంకు 1985లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రఫుల్ల కుమార్‌ మహంత వయసు 33 ఏళ్లు మాత్రమే. ఆ తరువాత 2012లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అఖిలేష్ యాదవ్ వయసు 39 సంవత్సరాలే.
Go Back to Shorts
Jagan
YSRCP
CM
Oath

More Telugu News