Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను, ఆయిల్‌ ట్యాంకర్‌‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు విధులు ముగించుకుని వడోదర జిల్లాలోని పాత్ర నుంచి బోర్సాద్‌లోని సరోల్ గ్రామానికి వెళ్తుండగా అంక్లావ్‌ ప్రాంతంలోని గంభీరా గ్రామం వద్ద  ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Gujarat
Anand dist
Road Accident

More Telugu News