అందరికీ ధన్యవాదాలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
Add ap7am to your home Screen

అందరికీ ధన్యవాదాలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

  • ఇవాళ తారక్ జన్మదినం
  • వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • ట్వీట్ చేసిన ఎన్టీఆర్
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఎన్టీఆర్ 1983 మే 20న జన్మించారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గత కొన్నిరోజుల నుంచే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. తారక్ సన్నిహితులు, సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ఉదయం నుంచే జూనియర్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షల తాకిడి ఎక్కువైంది. దీనిపై ఆయన స్పందిస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ముగ్ధుడ్నయ్యానంటూ ట్వీట్ చేశారు.
Jr Ntr
Tollywood

More Telugu News