Lagadapati: ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు!: ఫలితాలపై క్లూ ఇచ్చేసిన లగడపాటి

షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో అన్యాపదేశంగా చెప్పేశారు. ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు అంటూ చూఛాయగా పేర్కొన్నారు. కాగా ఫలితాలకు ముందు తన సొంత సర్వే ఫలితాలు వెల్లడించడానికి తిరుపతిని వేదికగా ఎంచుకున్నారు. రేపు తిరుపతిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది చెబుతానని తెలిపారు.

ఇవాళ అమరావతి ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధిక బడ్జెట్ ఉంది కాబట్టి అక్కడ కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, ఏపీలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి, ఇక్కడున్న పరిస్థితుల్లో వాళ్లకు సైకిలే కనిపించిందని అన్నారు. ఎవరి పరిస్థితుల్లో వాళ్లు తమకు అందుబాటులో ఉన్న వాహనం ఎక్కేశారని ఫలితాల తీరుతెన్నులను చెప్పకనే చెప్పేశారు.
Go Back to Shorts
Lagadapati

More Telugu News