godsey: గాడ్సేకు కూడా ఫ్యాన్ క్లబ్ ఉందని నాకు తెలియదు.. బీజేపీ నేతలకు చురకలు అంటించిన గుత్తా జ్వాల!

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ నేతలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్ లు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సేను ఓ రేంజ్ లో ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే అన్నివైపుల నుంచి విమర్శలు రావడం, బీజేపీ అధిష్ఠానం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరు వెనక్కు తగ్గి క్షమాపణలు కోరారు.

 తాజాగా ఈ వ్యవహారంపై బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా స్పందించారు. గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని తనకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిబట్టి భవిష్యత్ లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తే తనకు నిజంగానే భయం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుత్తా జ్వాల ట్వీట్ చేశారు.
Go Back to Shorts
godsey
gutta jwala
bjp
leaders praise

More Telugu News