దేశంలో గాడ్సేపై చర్చ జరుగుతోంది.. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను!: కేంద్ర మంత్రి హెగ్డే
- ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు చర్చ జరుగుతోంది
- ప్రస్తుత తరం గాడ్సేపై చర్చిస్తోందన్న హెగ్డే
- ఈ చర్చ కారణంగా గాడ్సే సంతోషించి ఉంటాడని వ్యాఖ్య
‘దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గాడ్సే విషయంలో ప్రస్తుత తరం చర్చ జరపడం నిజంగా ఆనందంగా ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో గాడ్సే గురించి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. ఈ చర్చ పట్ల నాథూరాం గాడ్సే నిజంగా సంతోషించి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు ఈ కేంద్ర మంత్రి వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఈ ట్వీట్ ను వెంటనే తొలగించిన హెగ్డే తన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కు గురి అయిందని తెలిపారు. గత వారం రోజుల్లో రెండుసార్లు ఇలా జరిగిందని వెల్లడించారు. కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సందేశాలను తన టైమ్ లైన్ లో పోస్ట్ చేశారనీ, దీనిపై విచారిస్తున్నానని స్పష్టం చేశారు.