ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా
Add ap7am to your home Screen

ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా

  • ఇంటర్ రీవాల్యూయేషన్ ఫలితాల తర్వాత వెలువడే అవకాశం
  • ఈనెల 27న రీవాల్యూయేషన్ ఫలితాలు
  • త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్న ఉన్నత విద్యామండలి
ఏపీలో ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేశారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాత ఎంసెట్ రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ విద్యార్థులు చాలామంది ఏపీలోనూ ఎంసెట్ పరీక్షలు రాయడం జరిగింది.

ఇంటర్ మార్కుల్లో తీవ్ర అసమానతలు కనిపించడంతో తెలంగాణలో భారీ సంఖ్యలో విద్యార్థులు రీవాల్యూయేషన్ కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రీవాల్యూయేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల కానున్నాయి. ఈ కారణంగానే  ఎంసెట్ ఫలితాలు ఆలస్యం కానున్నాయని అధికార వర్గాలంటున్నాయి. ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి పేర్కొంది. వాస్తవానికి ఎంసెట్ ఫలితాలు మే 18న విడుదలవ్వాల్సి ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే జూన్ మొదటివారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Telangana
EAMCET

More Telugu News