Chandrababu: చంద్రబాబుకు ఇదే చివరి కేబినెట్ సమావేశం: వైసీపీ నేత సజ్జల

షార్ట్స్‌లో చూడండి
ఏడేళ్లుగా రాష్ట్రం కరవులో ఉందని ప్రభుత్వమే చెప్పిందని, ఏనాడైనా కరవుపై చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహించారా? అని ప్రశ్నించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని ఫుట్ బాల్ ఆడుకున్నారని, జాతీయ నేతలను కలిసి ఆయన ఫొటోలు మాత్రమే తీసుకోగలిగారని విమర్శించారు. కొనఊపిరితో కొట్టుకుంటున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని సీట్లలో గెలుస్తామో చెప్పకుండానే అధికారంలోకి వస్తామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన తీరుపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారని  అన్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని రోజుల ముందు చంద్రబాబు కేబినెట్ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇదే చివరి కేబినెట్ సమావేశం కాబోతోందని జోస్యం చెప్పారు. 
Go Back to Shorts
Chandrababu
cm
Telugudesam
YSRCP
sajjala

More Telugu News