YSRCP: సర్వేలపై నిగ్గు తేల్చేందుకు మేము సిద్ధం, మీరు సిద్ధమేనా?: చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల సవాల్

షార్ట్స్‌లో చూడండి
అన్ని జాతీయ ఛానెళ్లు జగన్ గెలుస్తారనే చెబుతున్నాయని, భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత  సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందని, టీడీపీది గతం, వైసీపీది భవిష్యత్ అని అర్థమవుతోందని, జగన్ సీఎం కాబోతున్నారన్న విషయం వాస్తవం అని వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు రోజుకో ప్రకటనతో భ్రమ కల్పిస్తున్నారని, ఈ నెల 23 తర్వాత ఉత్కంఠకు తెరపడుతుందని అన్నారు. సర్వేలు తమకే అనుకూలమని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, తాను చేసింది తప్పని ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆయన ఒప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సర్వేలపై నిగ్గు తేల్చేందుకు ఈ నెల 19న మేము సిద్ధం, మీరు సిద్ధమా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నికల సంఘాన్ని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దూషించడం ద్వారా చంద్రబాబు సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు. 
Go Back to Shorts
YSRCP
sajjala
Telugudesam
Chandrababu
AP

More Telugu News