హాట్ టాపిక్ గా మారిన తమిళ హీరో విజయ్ నిర్ణయం
Add ap7am to your home Screen

హాట్ టాపిక్ గా మారిన తమిళ హీరో విజయ్ నిర్ణయం

  • వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్ 
  • అట్లీ కుమార్ తో మూడో సినిమా 
  • విజయ్ కోసం యువ దర్శకుల వెయిటింగ్
 తమిళనాట తిరుగులేని కథానాయకుడిగా రజనీ ఒక వెలుగు వెలుగుతున్నారు. సుదీర్ఘమైన తన కెరియర్లో ఎంతోమంది అగ్రదర్శకులతో కలిసి సినిమాలు చేసిన ఆయన, ఈ మధ్య కాలంలో యువదర్శకులకు అవకాశం ఇచ్చారు. అలా ఆయన 'కబాలి' .. 'కాలా' .. 'పేట' సినిమాలతో సందడి చేశారు. ఆల్రెడీ అదే బాటలో అడుగులు వేయడం మొదలుపెట్టిన విజయ్, ఈ విషయంలో మరింత వేగాన్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తోన్న విజయ్, ఈ సినిమా తరువాత కూడా యువ దర్శకులతో వరుస సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. కథా కథనాలు కొత్తగా వుంటాయనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని, తన సన్నిహితుల ద్వారా సంకేతాలు పంపించాడట. దాంతో యువ దర్శకులు కొత్త కథలపై కసరత్తులు మొదలెట్టారట. త్వరలోనే విజయ్ ను కలుసుకుని తమ దగ్గరున్న కథలను వినిపించడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. వాళ్లలో తొలి అవకాశం ఎవరికి లభిస్తుందో చూడాలి మరి.
vijay

More Telugu News