IRCTC: రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికుడు.. రెండేళ్ల తర్వాత రూ.33 రిఫండ్

షార్ట్స్‌లో చూడండి
రైలు టికెట్‌ను రద్దు చేసుకున్న ప్రయాణికుడికి రెండేళ్ల తర్వాత జీఎస్టీ రూపంలో వసూలు చేసిన రూ.33 రిఫండ్ చేసింది ఇండియన్ రైల్వే. కోల్‌కతాకు చెందిన ఇంజినీర్ సుజీత్ స్వామి (30) 2017 జూలై 2న ఢిల్లీ వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. గోల్డెన్ టెంపుల్ ‌రైలులో టికెట్‌కు గాను రూ.765 చెల్లించాడు. అయితే, అనివార్య కారణాల వల్ల జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు రోజు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు.

అయితే, టికెట్ రద్దు చేసుకున్న సుజీత్‌కు కేన్సిలేషన్ చార్జీ రూ.65, జీఎస్టీ రూ.35 కలుపుకుని రూ.100 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ అవాక్కయ్యాడు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే తాను టికెట్‌ను కేన్సిల్ చేసుకున్నానని, కట్ చేసిన రూ.35 ఇవ్వాలని ఐఆర్‌సీటీసీని కోరాడు. వారు నిరాకరించడంతో సుజీత్ గతేడాది ఏప్రిల్‌లో లోక్ అదాలత్‌ను ఆశ్రయించాడు. ఈ కేసులో తాజాగా సుజీత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. లోక్ అదాలత్ తీర్పుతో ఐఆర్‌సీటీసీ రెండేళ్ల తర్వాత తాజాగా అదనంగా కట్ చేసిన రూ.33ను స్వామి ఖాతాలో జమచేసింది.
Go Back to Shorts
IRCTC
Indian Railway
GST
Ticket
Kolkata
New Delhi

More Telugu News