తమిళ హీరో విజయ్ గొప్ప నటుడేమీ కాదు: మలయాళ నటుడు సిద్ధిఖీ
Add ap7am to your home Screen

తమిళ హీరో విజయ్ గొప్ప నటుడేమీ కాదు: మలయాళ నటుడు సిద్ధిఖీ

  • విజయ్ ‘సూపర్ స్టార్’ కావచ్చేమో!
  • కానీ ‘సూపర్ నటుడు’ మాత్రం కాదు
  • నా దృష్టిలో మంచి నటుడు, సూపర్ స్టార్ కమలహాసన్
తమిళ హీరో విజయ్ పై మలయాళ నటుడు సిద్ధిఖీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ‘సూపర్ స్టార్’ కావచ్చేమో కానీ ‘సూపర్ నటుడు’ మాత్రం కాదని వ్యాఖ్యానించారు. మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, విజయ్ ని ‘సూపర్ స్టార్’ గా ప్రజలు ఇష్టపడుతుంటారు కానీ, వాస్తవానికి ఆయన గొప్ప నటుడేమీ కాదని, కేవలం, స్టార్ డమ్ మాత్రమే ఆయన్ని నడిపిస్తోందని అన్నారు. తన దృష్టిలో మంచి నటుడు, సూపర్ స్టార్ కమలహాసన్ అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా తమ చిత్ర పరిశ్రమ గురించి సిద్ధిఖీ వ్యాఖ్యానిస్తూ, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి గొప్ప నటులు తమకు ఉండటం మలయాళ చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. మమ్ముట్టి, మోహన్ లాల్ లు తమకు ఎంతో సాయం చేస్తున్నారని కొనియాడారు. ప్రతి చిత్ర పరిశ్రమ అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ ను బట్టి రాణిస్తుందని, అలాంటి వాళ్ల వల్లే తమ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు జీవించగలుగుతున్నారని అన్నారు. అయితే, తమిళ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మరోలా ఉంటాయని చెప్పిన సిద్ధిఖీ, నటుడు విజయ్ పై పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, విజయ్ పై సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamilnadu
Malayalam
hero
vijay
siddhiqi

More Telugu News