అందరూ భయపడేది దేవుడికి కాదు ‘లా అండ్ ఆర్డర్' కే!: సినీ నటుడు నాగబాబు

  • మతమే లేకపోతే మతపెద్దలు అనే వారే ఉండరు
  • ఈ భూమి మీద మతాలు లేకుండా పోవాలి
  • ఎవడికీ ‘దేవుడు’ అంటే భయం లేదు
అసలు మతమే లేకపోతే మతపెద్దలు అనే వారే ఉండరని ప్రముఖ సినీనటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’ లో ఆయన మాట్లాడుతూ, కొన్ని వందల సంవత్సరాలకైనా ఈ భూమి మీద మతాలు లేకుండా పోతే, చాలా సుఖమైన ప్లేస్ ఈ భూమి అవుతుందని అన్నారు.

 ‘ ‘దేవుడు’ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎవరూ దేనికీ భయపడకుండా, విచ్చలవిడి తనం పెరిగిపోతుందేమో? అన్న ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ, ‘దేవుడికి ఎవరూ భయపడరు. ప్రతివాడు ఎదుటివాడిని కొట్టి, హింసించి, చంపి.. వాడు తప్పు చేశాడు తగిన శిక్ష విధించాను. ఆ దేవుడు చెప్పాడు నేను చేశాను అనే కాన్సెప్టే తప్ప, ఎవడికీ ‘దేవుడు’ అంటే భయం లేదు. మనిషి భయపడేది లా అండ్ ఆర్డర్ కే’ అని అన్నారు. 
Go Back to Shorts
Tollywood
Nagababu
God
Religion

More Telugu News