ఏపీ సీఎస్ కు మంత్రి వర్గ సమావేశ అజెండా పంపిన సీఎంఓ!
- పలు అంశాలపై చర్చిస్తామన్న సీఎంఓ
- దీన్ని ఆయా శాఖల కార్యదర్శులకు పంపనున్న సీఎస్
- ఆపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలన
సీఎంఓ పంపిన అంశాలను ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ పంపనున్నారు. ఆయా శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత, ఆయా అంశాలపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించాక ఆ అజెండాను ఈసీకి పంపుతారని సమాచారం. ఇదిలా ఉండగా, ముందస్తు అనుమతి కోసం ఈసీకి సమాచారం పంపాల్సి ఉండటంతో ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడినట్టు సమాచారం. ఈ నెల 14న మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.