సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నాగార్జున సినిమాలో కీర్తి సురేశ్!
- ఎన్టీఆర్, చరణ్ షూటింగుకి రెడీ
- తమిళ చిత్రంలో అనూ ఇమ్మానుయేల్
* రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఆమధ్య చరణ్, ఇటీవల ఎన్టీఆర్ షూటింగులో గాయపడడంతో ఈ చిత్రం షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో షూటింగును ఆరంభిస్తున్నారు.
* తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న కథానాయిక అనూ ఇమ్మానుయేల్ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. శివకార్తికేయన్ హీరోగా నటించే చిత్రంలో అనూ కథానాయికగా నటిస్తుంది.