మందుల తయారీలో దారుణం.. హైదరాబాద్ ల్యాబ్ గుట్టు రట్టు!
- మందుల తయారీలో కెటమైన్ డ్రగ్
- మానవ మృగంలా మారతాడని వెల్లడి
- ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలోనే..
మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ వాడటమే కాకుండా, వాటితో మహిళలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారని విచారణలో స్పష్టమైంది. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తిలో సెక్స్ హార్మోన్లు పెరిగి, మృగంలా మారతాడని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఈ డ్రగ్‌ను తీసుకున్న వ్యక్తి దాదాపు ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలోనే ఉంటాడని అధికారులు వెల్లడించారు. అధికారులు ల్యాబ్‌ను సీజ్ చేసి, దాని యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.