ఓ వైపు ఆనందం, మరోవైపు బాధలో ప్రియాంకా చోప్రా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ వైపు ఆనందం, మరోవైపు బాధలో ప్రియాంకా చోప్రా!

  • ప్రియాంక సోదరుడి వివాహం రద్దు
  • ఇదే సమయంలో మరిది పెళ్లి
  • సోఫీ టర్నర్ ను పెళ్లి చేసుకున్న జో జొనాస్
వారం రోజుల వ్యవధిలో ప్రియాంకా చోప్రా రెండు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వుండగా, ఒకటి రద్దయింది. తన సొంత సోదరుడి వివాహం రద్దుకాగా, మరిది వివాహం మాత్రం వైభవంగా జరగడంతో ఓ వైపు బాధ, మరోవైపు ఆనందంలో ఉండిపోయిందీ బాలీవుడ్ బ్యూటీ.

ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ పెళ్లి, గత వారంలో ఇషితా కుమార్ తో జరగాల్సి వుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండగా, ఇరు కుటుంబాలూ పెళ్లికి ఓకే చెప్పాయి. అన్నీ కుదిరాయని పెళ్లికి తేదీని కూడా ఖరారు చేసిన తరువాత, వీరిద్దరి మధ్యా బ్రేకప్ వచ్చింది. దీంతో పెళ్లి వేడుక రద్దు కాగా, ఇషిత తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఎకౌంట్ లో గతంలో ఉంచిన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను తొలగించారు.

తన సోదరుడి పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి ముంబై వచ్చిన ప్రియాంక, ఆపై రెండు రోజుల్లోనే తిరిగి వెళ్లిపోయింది. ఇక ఇదే సమయంలో ప్రియాంక భర్త నిక్ జొనాస్ సోదరుడు జో జొనాస్ పెళ్లి ఘనంగా జరిగింది. హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న జో జొనాస్ పెళ్లి వేడుకలో ప్రియాంక తన భర్తతో కలిసి ఎంతో సందడి చేసిందట.
Priyanka Chopra
Jo Jonas
Marriage
Ishita
Cancel

More Telugu News