సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మెగా హీరో సినిమాలో అవికా గోర్
- 'దొరసాని' షూటింగ్ పూర్తి
- రానా సినిమాలో ప్రియమణి
* హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడుగా, డాక్టర్ రాజశేఖర్ చిన్నమ్మాయి శివాత్మిక కథానాయికగా పరిచయం అవుతున్న చిత్రం 'దొరసాని'. నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు.
* రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం 1992' పేరిట ఓ పిరీడ్ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. సాయిపల్లవి కథానాయికగా నటించే ఈ చిత్రంలో ప్రముఖ నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుందట.