మేం ఒకటి చెబితే ఆయన పది రకాలుగా చేస్తాడు: మహేశ్ బాబుపై రామ్-లక్ష్మణ్ వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేం ఒకటి చెబితే ఆయన పది రకాలుగా చేస్తాడు: మహేశ్ బాబుపై రామ్-లక్ష్మణ్ వ్యాఖ్యలు

  • ఫ్యాన్స్ అంచనాలకు ఒక్క అంగుళం కూడా తగ్గలేదు
  • మా కెరీర్ లోనే బెస్ట్ ఫైట్ ఆయనకే చేశాం
  • మహర్షి ప్రీరిలీజ్ వేడుక
మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మహర్షి. మే 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

ఫ్యాన్స్ అంచనాలకు ఒక్క అంగుళం కూడా తగ్గకుండా ఇందులో మహేశ్ బాబుతో ఫైట్లు చేయించామని చెప్పారు. తాము ఒకటి చెబితే పదిరకాలుగా అవుట్ పుట్ ఇవ్వగలిగిన హీరో మహేశ్ బాబు అని కితాబిచ్చారు. సినిమా కోసం ప్రాణాలు పెట్టే హీరోల్లో మహేశ్ బాబు ఒకడని, 24 గంటలూ సినిమా గురించే ఆలోచించే వ్యక్తి అని మెచ్చుకున్నారు. వృత్తి పట్ల ఎంతో అంకితభావం ఉన్న అలాంటి హీరోతో పనిచేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రామ్-లక్ష్మణ్ వెల్లడించారు.

ఇందులో ఆయన చేసిన ఓ ఫైట్ ఎమోషనల్ గా ఉంటుందని, తమ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫైట్ గా నిలిచిపోతుందని ఈ సినీ కవలలు చెప్పారు. ఈ చిత్రంలో 1000 శాతం కమర్షియల్ అంశాలు ఉంటాయని, అన్ని వర్గాలను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను దర్శకుడు ఇందులో చొప్పించారని వెల్లడించారు. మహేశ్ బాబు పెర్ఫార్మెన్స్ లో భిన్న పార్శ్వాలుంటాయని, స్టిల్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు.
Mahesh Babu
Tollywood

More Telugu News