మహేశ్ 26వ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు?
- మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి'
- తదుపరి సినిమా అనిల్ రావిపూడితో
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
అనిల్ సుంకరకి మహేశ్ ఒక సినిమా చేసిపెట్టవలసి వుంది. ఇక అనిల్ రావిపూడితో గల సాన్నిహిత్యం కారణంగా దిల్ రాజు కూడా రంగంలోకి దిగాడు. అలా ఈ ఇద్దరి నిర్మాణంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ హఠాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలేమిటనేది తెలియాల్సి వుంది. అనిల్ సుంకర ఈ సినిమాకి సోలో నిర్మాతగా వ్యవహరిస్తాడన్నమాట.