త్వరలో సెట్స్ పైకి మహేశ్ 26వ సినిమా .. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో సెట్స్ పైకి మహేశ్ 26వ సినిమా .. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

  • మహేశ్ 26వ సినిమాకి సన్నాహాలు
  • కీలకమైన పాత్రలో విజయశాంతి 
  • జూన్ నుంచి సెట్స్ పైకి  
మహేశ్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇందుకుగాను విజయశాంతి భారీ పారితోషికమే అందుకోనున్నారనే టాక్ కూడా బలంగా వినిపించింది.

ఇక ఇటీవలే జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పుకున్నారు. తాజాగా ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదిస్తున్నారని సమాచారం. 'శివగామి' పాత్ర నుంచి రమ్యకృష్ణ క్రేజ్ .. పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. మహేశ్ మూవీ కోసం ఆమెను ఒప్పిస్తే అది ప్రాజెక్టును మరోస్థాయికి తీసుకువెళుతుందని అనిల్ రావిపూడి భావించాడట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
Mahesh Babu

More Telugu News