ఫుల్ బిజీగా కట్టప్ప .. రోజుకు 3 నుంచి 5 లక్షల పారితోషికం
- తమిళంలో వరుస సినిమాలు
- తెలుగులోను వరుస అవకాశాలు
- సత్యరాజ్ పారితోషికం 2 కోట్లు
ఈ నేపథ్యంలో ఆయన తన పాత్ర ప్రాధాన్యతను బట్టి మొత్తంగా మాట్లాడుకుంటే 2 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. అదే రోజుల వారీగా అయితే రోజుకి 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. సత్యరాజ్ ఎంత పారితోషికం అడిగినా నిర్మాతలు వెనుకాడరనీ, అందుకు కారణం ఆయన ఎలాంటి పరిస్థితుల్లోను నిర్మాతలను ఇబ్బంది పెట్టరని దర్శకులు చెబుతుంటారు. 'జెర్సీ' సమయంలో నాని కూడా ఇదే మాట చెప్పడం విశేషం