మోదీ బయోపిక్ నిర్మాతలకు ‘సుప్రీం’ షాక్.. మే 19 వరకు విడుదలకు నో
- ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోమని స్పష్టీకరణ
- చివరి విడత పోలింగ్ పూర్తయ్యాకే నిర్ణయం
- నిర్మాతల పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం
వివరాల్లోకి వెళితే... ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించడంతో విపక్షాలు కోర్టుకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు మేరకు వివరాలు సమర్పించాలని ఈనెల 15వ తేదీన ఎన్నికల సంఘాన్ని ఎపెక్స్ కోర్టు ఆదేశించింది. ఈనెల 22న ఎన్నికల సంఘం తన నివేదిక అందించింది.
సినిమా ఓ పార్టీకి ప్రయోజనం కల్పించేలా ఉందని, అందువల్ల సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ పూర్తయ్యే మే 19 వరకు విడుదలకు అంగీకరించకూడదని పేర్కొంది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈసీ నిర్ణయం సబబేనని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఈసీ చర్యల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మోదీ బయోపిక్‌లో మోదీ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించిన విషయం తెలిసిందే.