ఓటరు లిస్టులో పేరు లేకున్నా ఓటేసిన నటుడు శివకార్తికేయన్.. విచారణకు ఎన్నికల సంఘం ఆదేశం
- ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో మండిపడిన నటుడు
- ఆ తర్వాత కాసేపటికే ఓటేసినట్టు సోషల్ మీడియాలో పోస్టు
- విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్
ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వచ్చిన శివ కార్తికేయన్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం వివాదాస్పదమైంది. ఓటు వేసినట్టు వేలిని చూపిస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశాడు. తొలుత ఓటు లేదని హంగామా చేసి ఇప్పుడు ఓటు ఎలా వేశారంటూ మీడియా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరైన నటుడు ప్రత్యేక అనుమతితో వచ్చి ఓటేశానని వివరణ ఇచ్చాడు. విషయం కాస్తా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. ఎన్నికల అధికారులకు సైతం నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని పేర్కొంది.