ప్యారిస్ లో ఫ్యామిలీతో మహేశ్ షికారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్యారిస్ లో ఫ్యామిలీతో మహేశ్ షికారు

  • 'మహర్షి' షూటింగు పార్టు పూర్తి 
  • ప్యారిస్ లోని ఫొటోను షేర్ చేసిన నమ్రత
  •  మహేశ్ మరింత యంగ్ గా ఉన్నాడంటూ కామెంట్స్
మహేశ్ బాబు ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళుతుంటాడు. సెట్స్ పై వున్న సినిమా పూర్తయిన తరువాత .. కొత్త సినిమా పట్టాలెక్కడానికి ముందు ఆయన ఇలా ఫ్యామిలీతో కలిసి సరదాగా విదేశాలకి వెళుతుంటాడు. అలాగే ఆయన ఈ సారి 'మహర్షి' సినిమా షూటింగు పార్టు పూర్తి కాగానే, ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు. అంతా కలిసి అక్కడ సరదాగా షికారు చేస్తున్నారు.

 ఆ సమయంలో దిగిన ఒక ఫొటోను మహేశ్ బాబు శ్రీమతి నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. 'ప్యారిస్ లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది' అంటూ మహేశ్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఈ ఫొటోలో మహేశ్ బాబును చూసిన అభిమానులు ఆయన మరింత యంగ్ గా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆయన అచ్చం గౌతమ్ కి బ్రదర్ లా వున్నాడని కొంతమంది అంటుంటే, మరికొంత మంది 'సితార' ఏమైపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. 
Mahesh Babu
namrata

More Telugu News