మహేశ్ స్టామినా... రూ. 140 కోట్లు దాటిన 'మహర్షి' బిజినెస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ స్టామినా... రూ. 140 కోట్లు దాటిన 'మహర్షి' బిజినెస్!

  • 'భరత్ అనే నేను' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేశ్
  • 'మహర్షి' డిజిటల్, శాటిలైట్ హక్కులకే రూ. 47.50 కోట్లు
  • ఆంధ్రా, సీడెడ్, నైజాం రైట్స్ కు భారీ మొత్తం
'భరత్ అనే నేను' సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఇప్పుడు 'మహర్షి'తో ప్రేక్షకుల ముందుకు రానున్న మహేశ్ బాబు, సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టేశాడు. ఈ సినిమా బిజినెస్ సుమారు రూ. 140 కోట్ల వరకు జరిగి, టాలీవుడ్ లో రికార్డును సృష్టించినట్టు తెలుస్తోంది. వచ్చేనెల 9న విడుదల కానున్న ఈ సినిమాకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలోనే రూ. 47.50 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.

తెలుగు శాటిలైట్ హక్కుల రూపంలో రూ. 14.5 కోట్లు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులకు రూ. 20 కోట్లు, డిజిటల్ హక్కులకు 11 కోట్లు, ఆడియో హక్కులకు రూ. 2 కోట్లు వచ్చాయట. ఇక ఓవర్ సీస్ లో సుమారు రూ. 12.5 కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇక ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాల హక్కులను కూడా కలిపితే ఈ మొత్తం రూ. 140 కోట్లకు పైనేనని సమాచారం. మహేశ్ కెరీర్ లో ఇది ఆల్ టైమ్ రికార్డు కాగా, ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందాల నటి పూజా హెగ్డేతో పాటు అల్లరి నరేశ్ కూడా ఇందులో నటిస్తున్నారు.
Maharshi
Mahesh Babu
Business

More Telugu News