టీడీపీ నేతలు బడా బాబులుగా తయారయ్యారు: జీవీఎల్
- ఏపీలో ఐదేళ్ల పాలన అవినీతిమయం
- ఏపీ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది
- ఏపీలో అన్ని స్కీమ్ ల్లోనూ స్కామ్ లే
గత పాలకులు ప్రకాశం జిల్లా పట్ల పూర్తిగా వివక్ష చూపించారని విమర్శించారు. ఏపీలో ఐదేళ్ల పాలన అవినీతిమయం అన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోందని, ఎందుకంటే, ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, అడ్డగోలుగా అన్ని స్కీమ్ ల్లోనూ స్కామ్ లు చేసి, బడా బాబులుగా టీడీపీ నేతలు తయారయ్యారని ఆరోపించారు. ఏపీలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రప్రభుత్వం చలువేనని అన్నారు. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన స్టిక్కర్ వేసుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు 'ఓ స్టిక్కర్ బాబు’ అని విమర్శించారు.