యూట్యూబ్ లో 'మహర్షి' ప్రభంజనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూట్యూబ్ లో 'మహర్షి' ప్రభంజనం!

  • ఆన్ లైన్ లో దూసుకెళుతున్న మహేశ్ బాబు టీజర్
  • ఒక్క రోజులో అత్యధిక వ్యూస్
  • అత్యధికులు రీట్వీట్, లైక్ చేసిన టీజర్ గా గుర్తింపు
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. అభిమానులకు ఉగాది కానుకగా వచ్చిన ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం మహర్షి టీజర్ కు యూట్యూబ్ లో ఒక 1.2 కోట్ల వ్యూస్ రావడం విశేషం అని చెప్పాలి. అంతేకాదు, కోటి వ్యూస్ నుంచి 1.2 కోట్ల వ్యూస్ కి చేరడానికి చాలా తక్కువ సమయం తీసుకున్న టీజర్ గా మహర్షి రికార్డు నెలకొల్పింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువమంది చూసిన టీజర్ కూడా ఇదే. దాంతోపాటే, ట్విట్టర్ లో ఎక్కువమంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్ గానూ మహర్షి మరో ఘనత అందుకుంది.

మహర్షి టీజర్ కు తొలి 24 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. కేవలం 13 గంటల్లో కోటి వ్యూస్ వచ్చినట్టు వివరించారు. మహేశ్ బాబు గెటప్, స్టయిల్ కొత్తగా ఉండడంతో పాటు సినిమా టేకింగ్ కూడా వినూత్నంగా ఉండడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే కథానాయిక. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేశ్ ఫ్రెండ్ గా నటిస్తుండడం ఆసక్తి కలిగించే అంశం.
Mahesh Babu
Tollywood

More Telugu News