రుషి కుమార్ సక్సెస్ స్టోరీ ఆగిపోయినట్టేనా?... అదరగొడుతున్న "మహర్షి" టీజర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రుషి కుమార్ సక్సెస్ స్టోరీ ఆగిపోయినట్టేనా?... అదరగొడుతున్న "మహర్షి" టీజర్!

  • ఉగాది సందర్భంగా విడుదలైన టీజర్
  • మల్టీ బిలియనీర్ గా, కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తున్న ప్రిన్స్
  • టీజర్ విడుదలైన నిమిషాల్లోనే లక్షల్లోకి వ్యూస్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'మహర్షి' టీజర్ ఉగాది పర్వదినం సందర్భంగా కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 1.19 సెకన్ల నిడివివున్న ఈ టీజర్ వీడియోలో మహేశ్ ను, చాలా స్టయిలిష్ గా చూపించారు. ఆయన పాత్ర పేరు రిషికుమార్ కాగా, మల్టీ బిలియనీర్ గా ఆకాశహర్మ్యాల మధ్య చాపర్ లో మహేశ్ దిగడంతో టీజర్ మొదలవుతుంది.

ఆపై "రిషికుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్టేనా?" అని మీడియా సమావేశంలో తాను ఎదుర్కొన్న ప్రశ్నకు "సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ" అన్న డైలాగ్, "నాకో ప్రాబ్లమ్ ఉంది సార్... ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే... గెలిచి చూపించడం నాకు అలవాటు" అన్న డైలాగులున్నాయి. టీజర్ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే దీని వ్యూస్ లక్షల్లోకి వెళ్లిపోవతం గమనార్హం. ఈ టీజర్ ను మీరూ చూడండి.
Maharshi
Mahesh Babu
Teaser

More Telugu News