అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయనున్న ప్రియాంక చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయనున్న ప్రియాంక చోప్రా

  • నిక్ జోనస్ తో ప్రియాంక ప్రేమ వివాహం
  •  విడాకులు తీసుకోనున్నారంటూ అమెరికన్ మ్యాగజైన్ కథనం
  •  సీరియస్ గా తీసుకున్న ప్రియాంక చోప్రా  
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా .. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హిందూ .. క్రిస్టియన్ మతాచారాల ప్రకారం జరిగిన వీరి వివాహం ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వీరి పెళ్లి వేడుకకి సంబంధించిన విషయాలను మరిచిపోకమునుపే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనీ ..  విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చేశారనే వార్తను ఓ అమెరికన్ మ్యాగజైన్ ప్రచురించింది.

దాంతో ప్రియాంక చోప్రా అభిమానులంతా నివ్వెరపోయారు. ఆ తరువాత ఈ వార్తలో నిజం లేదనే సంగతి తెలుసుకుని తేలికగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా మాత్రం తేలికగా తీసుకోవడం లేదట. సదరు అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయడానికి ఆమె సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా .. తమ వైవాహిక జీవితం నాశమైందనే కథనాన్ని ప్రచురించి, తమకు తీవ్ర మనస్తాపం కలిగించిన సదరు మ్యాగజైన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కోర్టుకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. 
priyanka chopra

More Telugu News